జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం జూలై లో అత్యాచారం, కులం పేరుతో దూషించిన షార్ట్ ఫిల్మ్ నటుడు ప్రీయంత్ పైన కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మహిళా జూనియర్ ఆర్టిస్ట్, షర్ట్ ఫిల్మ్ నటుడు ప్రియంత్‌కు నాలుగు సంవత్సరాలుగా పరిచయం వుందని, ప్రియంత్ జులై నెలలో అత్యాచారం , చేసి కులం పేరుతో దూషించాడని తెలిపారు. దీనిపై మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.

నిందితుడు పరారీలో వున్నాడని అన్నారు. తనకోసం గలిస్తుండగ బుధవారం ప్రియాంత్‌ను పట్టుకుని అత్యాచారం చేయటంతో పాటు కులం పేరుతో దూషించినందుకు షర్ట్ ఫిల్మ్ నటుడు ప్రియంత్ పైన 383 / 22 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసామని, పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి వుందని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.