పుల్వామా దాడికి వ్యూహకర్త జైషే ఈ మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మృతి చెందాడని కథనాలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో చాలాకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ ఆసుపత్రిలోనే చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇస్లామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా చాలాకాలంగా ప్రచారంలో ఉండగా అక్కడే మృతిచెందినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మసూద్ అజర్ కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతూ పెషావర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఆస్పత్రిలో నిత్యం ఇక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నట్టు ఆ దేశ-విదేశాంగ శాఖ మంత్రి కూడా అధికారికంగా రెండు రోజుల క్రితం ధ్రువీకరించగా అతడు పూర్తి అనారోగ్యంతో ఉన్నాడని, ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాడని ప్రకటించారు. కాగా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ మార్చి 2వ తేదీన చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.