టర్కీ పర్యటన

26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నారు.

జిల్లా

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆమ్రపాలి కాట సెలవులో వెళ్లనున్నా రు. ఈ నెల 15 నుంచి మార్చి7వ తేదీ వరకు 21రోజులు సెల వు మంజూరు చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. కలెక్టర్ సెలవులో వెళ్తున్నందున జాయింట్ కలెక్టర్ హరితకు వరంగల్ రూరల్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యత లు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సెలవులో వెళ్తున్న కలెక్టర్ ఆమ్రపాలి తన వివాహం సందర్భంగా ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జమ్ము-కశ్మీర్, 22నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్‌లో, 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు టర్కీలో ఉంటారు. కాగా, మళ్లీ కలెక్టర్ ఆమ్రపాలి విధుల్లో చేరేవరకు జేసీ హరిత కలెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.