“ టాప్ లెస్‌గా పాట పాడిన టెన్నిస్ ప్లేయర్ “

గ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడారు. రొమ్ము కేన్సర్ అవగాహన నెల సందర్భంగా ఆమె ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అనే పాటను ఆలపించారు. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ బ్రెస్ట్ కేన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేశా’’నని ఆమె చెప్పారు. ‘‘రొమ్ము కేన్సర్‌ను ముందుగానే ఈ వ్యాధిని గుర్తించడం ముఖ్యం.

ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని మహిళలకు ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నా’’ సెరెనా తెలిపారు.