తెలుగు యంగ్ హీరో ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడని వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. అతని మరణానికి గల కారణాలు తెలియరాలేదు సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ-నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుధీర్‌ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ తెలిపారు. 2013లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘సెకండ్ హ్యాండ్’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత వర ముళ్లపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కుందనపు బొమ్మ’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా కీలక పాత్రలను పోషించాడు. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత నిర్మించిన ‘షూటౌట్ ఎట్ ఆలేర్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. సుధీర్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.ట