టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా బిగిసిపోయాడు. ఫ్రిజ్‌లో కూలింగ్ ఎక్కువగా ఉండటంతో..లోపల నుంచి పొగలు వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడతున్నారు. చిన్న పిల్లాడితో ఇదేం చేష్టలంటూ తిట్టిపోస్తున్నారు. ఆ పసివాడికి ఏదైనా అయితే ఏం చేస్తారు. వారు అసలు కన్నవారేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సరదా పేరుతో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమేంటంటు శాపనార్థాలు పెడుతున్నారు.