రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గౌరవం లేదని, తనపై, తన అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపిన సోమారపు సత్యనారాయణ కొందరి వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అడగకుండానే ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. కాగా త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరిఖని నుండి సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.