హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్‌ ఇచ్చింది. నామాకు చెందిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుకాన్‌ సంస్థల 105 స్థిర, చరాస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ కేసులో ఆస్తులను జప్తు చేశారు. హైదరాబాద్‌, విశాఖ, బెంగాల్‌లో కూడా రూ.88.85 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.