తెలంగాణ ఉద్యమంలో జైళ్లపాలై, ఆస్తులు కోల్పోయిన వారు ఏ ఒక్కరూ టీఆర్‌ఎ్‌సలో కనపడటం లేదని, నిజమైన తెలంగాణ వాదులంతా బీజేపీలో ఒక్కొక్కరుగా చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన అంతానికి చేసే యుద్ధానికి బీజేపీ సిద్ధమైందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అవినీతిని బయటపెట్టి, ఆ పార్టీ నేతలను జైలుకు పంపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ కార్యకర్తలు పోలీసు కేసులు, లాఠీ దెబ్బలకు భయపడరని స్పష్టం చేశారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని మాట్లాడిన కేటీఆర్‌కు బుద్ధి వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో యువత స్పందించడం అభినందనీయమన్నారు.

సీఎం పదవి రాలేదని కేటీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బీజేపీ తేనెతుట్టను కేటీఆర్‌ కదిపారని, ఇక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పనిపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అనేక ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కనుసన్నల్లో పోలీసులు, అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ యువకులను, వారి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, కొందరిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ఇంది మంచి పద్ధతి కాదన్నారు. ఉగ్రవాదానికి సహకరించే మజ్లి్‌సతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. హరితహారం కార్యక్రమానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులన