{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582166954696","total_editor_time":115,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582166937342","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ సీఎండీ రఘుమారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ సోషల్‌‌ మీడియాలో ఆరోపణలు చేసిన ఏడీఈ కోటేశ్వర్‌‌రావును సస్పెండ్​ చేశారు. కోటేశ్వర్​రావు సంస్థ రూల్స్​ను అతిక్రమించారని, అందుకే వేటు వేస్తున్నామని పేర్కొంటూ సీఎండీ రఘుమారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్​ ఎస్పీడీసీఎల్​లో భారీగా అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా పనులు అప్పజెప్తున్నారని కోటేశ్వర్​రావు ఈ నెల 4వ తేదీన ఫేస్​బుక్​లో వీడియో పోస్టు చేశారు.

ఇది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 3.73 లక్షల వ్యూస్‌‌ రాగా, ఆరు వేల మందికిపైగా ఆ పోస్టును షేర్​ చేశారు. అవినీతి అంశంపై అంతటా చర్చ మొదలైంది. ఈ క్రమంలో బుధవారం కోటేశ్వర్​రావును సస్పెండ్​ చేశారు. ఏపీఎస్‌‌ఈబీ, టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ రెగ్యులేషన్‌‌ రూల్స్​ను అతిక్రమించారని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హెడ్‌‌ క్వార్టర్‌‌ (హైదరాబాద్‌‌ ) వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.

రూల్స్ ​ అతిక్రమించినందుకే:

నిబంధనలను అతిక్రమించినందుకే కోటేశ్వర్‌‌రావుపై చర్యలు తీసుకున్నం. 21 వేల మంది ఉద్యోగులున్న ప్రతిష్టాత్మకమైన టీఎస్‌‌ఎస్పీడీసీఎల్‌‌ సంస్థ రూల్స్​ను అతిక్రమించి ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదు. అందుకే ఏడీఈని సస్పెండ్‌‌ చేశాం: రఘుమారెడ్డి, టీఎస్ ‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ

నేను నష్టపోయినా పర్లేదు:

సంస్థ మనుగడే ముఖ్యం. నేను నష్టపోయినా ఫర్వాలేదు. సంస్థను కాపాడేందుకు నేను మొదటి నుంచి పనిచేస్తున్న. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. వాస్తవాలు సీఎం వరకు చేరాలి. – ఏడీఈ కోటేశ్వర్‌‌రావు