భక్తుల కొంగు బంగారం తిరుమల వెంకన్న దర్శనానికి సబంధించిన నిబంధనలు మారుస్తున్న టీటీడీ సామాన్యుల కోసం మరో బంపర్ ఆఫర్‌తో వస్తోంది. రూ. 10 వేలు చెల్లిస్తే ఎవరికైనా తనివితారా వీఐపీ బ్రేక్ దర్శనం చేయించాలని నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 10 లక్షలకుపైగా విరాళాలు చెల్లించిన వారికి, బడా నేతల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చే వారికే ఈ దర్శనం లభిస్తోంది. ‘శ్రీవాణి‘ పథకం కింద రూ. 10వేల వీఐబీ బ్రేక్ దర్శనం కల్పించడానికి కసరత్తు పూర్తయిందని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని టీటీడీ వర్గాలు చెప్పాయి. శ్రీవాణి పథకం కింద దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలను నిర్మిస్తోంది. టీటీడీ ఇప్పటికే ఎల్ 1, ఎల్2, ఎల్3 వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. సామాన్యులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది.