టీడీపీకి షాక్ వరంగల్ ముఖ్యనేతల రాజీనామా
నర్సంపేట పట్టణానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి నర్సంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకుబ్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 1985లో ఆయన టీడీపీలో చేరి, పార్టీలో వివిధ పదవులను చేపట్టిన యాకుబ్‌రెడ్డి అప్పటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులల్లో టీడీపీ పార్టీలో కొనసాగలేక టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించారు.
తనతో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు కొయ్యటి సంపత్, టీడీపీ పట్టణ కార్యదర్శి మహాదేవుని రాజవీరు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి రామాగొని సుధాకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ దొమ్మటి సత్యం, నీటి సంఘం మాజీ చైర్మన్ చిలువేరు కుమారస్వామి, మోతే సంపత్‌రెడ్డి, చిలువేరు కొమ్మాలులతో పాటు ముఖ్యనాయకులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు యాకుబ్‌రెడ్డి తెలిపారు. కాగా.
వీరంతా ఆదివారం టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.