హైదరాబాద్: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక ఢిల్లీ పెద్దల కుట్ర ఉందని మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఢిల్లీ పెద్దలదైతే తెలంగాణ బీజేపీ నేతలు నటులన్నారు. బెయిల్ వస్తే ఏదో సాధించినట్టు పార్టీ లీడర్లు ఫీలవుతున్నారని, దొంగతనం చేసినోళ్ల కు కూడా వస్తుందన్నారు. ఇవాళ హైదరా బాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బండి తప్పు చేశాడా.? లేదా.? అన్నది కోర్టు తేల్చుతుంది, రాజకీయాల కోసం విద్యార్థులను బలి చేస్తారా?’ అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

‘ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతుండ్రు. సంజయ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏ2 ప్రశాంత్ తమవాడేనని బీజేపీ ఒప్పుకున్నది’ అని చెప్పారు. ఏదో ఘనకార్యం చేసినట్టు బీజేపీ హైకమాండ్ గో ఏహెడ్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు..