జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. రక్తపుటేరులు పారించారు. జవాన్లే లక్ష్యంగా మారణహోమం సృష్టించారు. అవంతిపొరాలో CRPF జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ముందుగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలైంది. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 40మంది జవాన్లు చనిపోయారు. 50మంది జవాన్లకు గాయాలయ్యాయి. భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ దాడి తమపనేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడికి 100 కిలోల ఐఈడీని ఉపయోగించారు. 70 వాహనాల్లో 2వేల 500మంది జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్నారు. అదను చూసి ఉగ్రవాదులు దెబ్బకొట్టారు.
పేల్చేసుకున్నాడు.
దాడి సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి..