ట్రావెల్స్ బస్సు, ట్రాక్టర్ ఢీ వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపెల్లి శివారులోని మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. వరంగల్ నుంచి పర్వతగిరి వైపు వస్తున్న ట్రావెల్ బస్సు, సోమారం నుంచి తీగరాజుపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం దెబ్బతినగా, ట్రాక్టర్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్లకు ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలతో బయటపడినట్లు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.