లెజెండ్, లయన్, కబాలి, రక్తచరిత్ర వంటి చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైన రాధికా ఆప్టే. రీసెంట్‌‌గా తాను చేసిన బోల్డ్ పాత్రల గురించి కూడా సూటిగా చెప్పింది. సౌత్‌‌లో రక్తచరిత్ర, లెజెండ్, లయన్, కబాలి చిత్రాల్లో చాలా డిగ్నిఫైడ్ రోల్స్ చేసింది రాధిక. కానీ నార్త్‌‌లో ఆమె చేసిన పాత్రలు మాత్రం పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అందాన్ని మితిమీరి చూపించే రోల్స్ చేయడమే సెన్సేషన్ అంటే, న్యూడ్‌‌గా కూడా నటించి షాకిచ్చింది. అయితే అదంతా తప్పనిసరి పరిస్థితుల్లో మనీ కోసం చేశాను అంటోంది రాధిక.

Advertisement

‘ఇండస్ర్టీలో అడుగుపెట్టిన కొత్తలో మనీలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. సాయం చేసేందుకు ఎవరూ లేరు. అందుకే ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేసేదాన్ని. ఆ క్రమంలోనే కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేశాను. ‘పర్‌‌‌‌ఛేద్’ మూవీలో నగ్నంగా నటించింది కూడా అందుకే’ అంటూ ఏమాత్రం మొహమాటపడకుండా చెప్పింది. అంతే కాదు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్’లో చాన్స్ వచ్చిందట.

కానీ అప్పట్లో ఆమె బీర్ ఎక్కువగా తాగేదట. దానివల్ల బాగా బరువు పెరగడంతో ఆ చాన్స్ పోయిందట. ‘ఇప్పుడు మాత్రం చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. అందుకే ఇక అలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం లేదు’ అంటోంది రాధిక. ఏదేమైనా ఆమె ముక్కుసూటితనాన్ని, ముసుగు వేసి మాట్లాడని మంచి లక్షణాన్ని అభినందించాలి.