డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ మోసం చేస్తుందా..?

నిన్న జరిగిన ఓ సంఘటన అనుమానాలకు తావిస్తోంది. మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని మద్యం తాగాడంటూ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో రిపోర్ట్ వచ్చిందని పోలీసులు కేసు పెట్టారు. అయితే తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆ వ్యక్తి ఎంత మొరపెట్టుకున్నా వినలేదు. చివరకు అర్థరాత్రి నాగభూషణ్ రెడ్డి అనే ఈ బాధితుడు తనే స్వయంగా గాంధీ ఆస్పత్రికి పోయి వైద్యపరీక్షలు చేయించుకుంటే రక్తంలో మద్యం ఆనవాళ్లు లేవని, అతను మద్యం సేవించలేదని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అయినా పోలీసులు ఒప్పుకోలేదు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మద్యం తాగినట్టు రిపోర్ట్ అందిందని వాహనం సీజ్ చేసి కేసు పెట్టారు.

తాను మద్యం తాగలేదని మెడికల్ రిపోర్ట్ లో వచ్చినా ఇదేం అన్యాయం అని నాగభూషణ్ రెడ్డి లబోదిబోమంటున్నాడు. దాంతో తమకు సంబంధం లేదని బ్రీత్ ఎనలైజర్ ఇచ్చిన రిపోర్టే ఫైనల్ అని సీజ్ చేసిన వాహనాన్ని ఇవ్వకుండా పోలీసులు కేసు పెట్టారు. ఈ సంఘటనతో అసలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిజాలు చెబుతుుందా, అబద్ధాలు చెబుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.