ఐదు నెల లక్రితం తండ్రి పిడుగుపాటుతో మృతి చెందగా మనస్థాపం చెందిన తనయుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన శివునిపల్లి రైల్వేస్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగింది . రైల్వే పోలీసులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జఫర్గడ్ మండల కేంద్రంలో నివాసముంటున్న షేర్ల పద్మ శ్రేనివాస్ దంపతుల మూడవ కుమారుడు శేర్ల రాఘవేంద్ర ( 20 ) అనే యువకుడు బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతు న్నాడు . అతని తండ్రి శ్రీనివాస్ పిడుగుపాటుతో ఐదు నెలల క్రితం వ్యవసాయ బావివద్ద మృతిచెందాడు . అప్పటి నుండి తండ్రి చనిపోయిన బాధతో మనస్థాపం చెందిన రాఘవేంద్ర శుక్రవారం ఉదయం స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి రైల్వేస్టేషన్లో విశాఖ పట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లే గరీబ్రబి సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .

సమాచారం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ జప్పార్ సింగ్ , కానిస్టేబుల్ అశోక్లు సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామ జరిపి పోస్టుమార్టంకై మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . మృతునికి ఇద్దరు సోదరులు పెద్దవాడు తేజ , రెండవవారు రాకేష్లు ఉన్నారు . వీరి తల్లి పద్మతో కలిసి మేదరి కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాళ్లు , చిన్నవాడైన రాఘవేంద్ర మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి .