ఇదో విచిత్రం ,విధి విలాసం ..

పాకిస్తాన్ చెరలో చిక్కిన మన వాయు వీరుడు అబినందన్ తండ్రి వర్థమాన్ ఎయిర్ మార్షల్ గా పనిచేశారు. తండ్రి బాటలోనే కొడుకూ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఇప్పుడు పాక్ ముష్కరుల చెరలో ఉన్నా అతడు చూపే దేశ భక్తి , తెగువ , గుండె దైర్యం మన జాతికే గర్వకారణం . 2017లో మణిరత్నం తీసిన కాట్రు విలియాదై అనే తమిళ చిత్రానికి అబినందన్ తండ్రి వర్థమాన్ సలహాదారుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో భారత్ పైలెట్ ను పాక్ సైనికులు బందీగా పట్టుకుపోతారు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. మిలిటరీలో ఎయిర్ మార్షల్ గా పనిచేసిన అబినందన్ తండ్రి వర్థమాన్ సలహాలతో సరిహద్దుల్లో పోరాటాలను ఈ సినిమాలో తీశారు. ఇప్పుడు ఏకంగా తన కొడుకే పాక్ కు బందీగా దొరికాడు. ఇదే విచిత్రమంటే. అయినా తన కొడుకు మొక్కవోని ధైర్యసాహసాలు గలవాడని చెబుతున్నారు. అబినందన్ కి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇది వీరుడి లక్షణం.

పాకిస్థాన్ మేజర్ : నువ్వు ఏ ఏయిర్ క్రాఫ్ట్ తొ వచ్చావు.

అభినందన్ : సారి మేజర్, ఆ విషయం మీతొ చెప్పాలనుకోవడం లేదు.

పాకిస్థాన్ మేజర్ : నువ్వు ఏ ఆపరేషన్ కొసం పాకిస్థాన్ లోకి వచ్చావు.

అధినందన్ : సారి మేజర్, ఆ విషయమ మీతో చెప్పాలనుకోవడం లేదు.