తన కోర్కెను తీర్చలేదని 13 ఏళ్ల బాలుడి జననాంగాలను ఓ వివాహిత గాయపరిచి

గ్రేటర్‌ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. తన కోర్కెను తీర్చలేదని 13 ఏళ్ల బాలుడి జననాంగాలను ఓ వివాహిత గాయపరిచిన ఘటన వెలుగుచూసింది. బదాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చప్రౌలా గ్రామంలో ఈ దారుణం జరిగిం‍దని పోలీసులు తెలిపారు. నిందితురాలు గత శుక్రవారం ఒంటరిగా ఉన్న సమయంలో తన పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిచి తన కోర్కెను తీర్చాలని బలవంతపెట్టిందని,

బాలుడు నిరాకరించడంతో వేడి అట్లకాడతో జననాంగాలపై వాతపెట్టిందని పోలీసులు తెలిపారు.