తన తల్లి, అన్న 10నెలల క్రితం బలవన్మరణానికి పాల్పడగా

తన తల్లి, అన్న 10నెలల క్రితం బలవన్మరణానికి పాల్పడగా మనస్తాపం చెందిన బాలిక తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ నోట్‌ రాసి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన దొంటికె మమత(16) అన్న శ్రీను గత సంవత్సరం డిసెంబరు 6న వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా సమాచారమందుకున్న తల్లి పార్వతమ్మ కొడుకు మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వెంటనే అక్కడే ఉన్న పురుగుల మందు తాగి చనిపోయింది. కొన్ని గంటల తేడాతోనే ఆ కుటుంబంలో ఇద్దరు బలవర్మరణం చెందారు. జనగామలో ప్లాట్‌ కొందామని శ్రీను తల్లిదండ్రులతో చర్చించగా, చెల్లెలు మమత పెళ్లికి ఉందని, ఇప్పడే ప్లాట్‌ కొనటం ఎందుకని అనటంతో మనస్తాపం చెందిన శ్రీను బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి పార్వతమ్మ అదేపని చేసింది.