యాంకర్ అనసూయ బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. బుల్లితెర కార్యక్రమాల్లో గ్లామర్ గా కనిపిస్తూ అనసూయ చేసే హంగామా అంతా ఇంతా కాదు. యాంకర్ గా పలు టీవీ కార్యక్రమాలని అనసూయ విజయవంతంగా నడిపిస్తోంది. ఆదివారం రోజు దేశం మొత్తం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెరపై కూడా శ్రీరామనవమి స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓ ఛానల్ లో అనసూయ యాంకర్ గా ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాంని కలర్ ఫుల్ గా, కనుల పండుగగా ప్లాన్ చేశారు. ఇందులో ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యూల్, వర్ష లాంటి బుల్లితెర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోగ్రాంలో ఆర్టిస్టులు భార్య భర్తలు అత్తా కోడళ్ల రిలేషన్ కి సంబంధించిన స్కిట్స్ చేశారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్త భరద్వాజ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా ఆయనతో నేను రోజు ప్రేమలో పడుతుంటాను. మా ఆయనని చెప్పడం కాదు కానీ అలాంటి భర్త ఈ ప్రపంచానికి చాలా అవసరం అని అనసూయ పేర్కొంది. ప్రోమోఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మధ్యలో ఆటో రాంప్రసాద్ తన కామెడీ పంచ్ లతో అలరితున్నాడు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న చాలా మంది ట్రెడిషనల్ డ్రెస్ లలో మెరిశారు. అనసూయ లంగాఓణీ ధరించి, ఆభరణాలతో అలంకరించుకుని అందంగా ముస్తాబైంది. అత్త కోడలిని టార్చర్ పెట్టె స్కిట్ జరుగుతున్నప్పుడు అనసూయ ఎమోషనల్ అయింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ ని ఫ్యామిలీ రిలేషన్స్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో హాట్ హాట్ గా పరువాలు ఒలకబోసే అనసూయ లంగా ఓణీలో మెస్మరైజ్ చేస్తోంది.