వివాహేతర సంబంధం నేపధ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇల్లెందు మండలం బచ్చుతండాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన వాంకుతోడు వెంకన్న (40) పై అదే గ్రామానికి చెందిన లాలు అనే వ్యక్తి రోకలిబండతో దాడి చేశాడు.

ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే మరణించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నదన్న కారణంతోనే లాలు దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.