మండలంలోని సబితం గ్రామానికి చెందిన చెంచు శ్రీనివాస్ తన భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పెద్ద నాన్న కుమారుడైన చెంచు రాజేశం ను పక్కా పథకంతో జులై 18 న తన పొలం వద్దకు పిలిచి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన ఒకరి కారులో శవాన్ని పట్టుకొని మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ శివారులోని గాడిదల గండిపైన అటవీ ప్రాంతంలో రాజేశం శవం పై కిరోసిన్ పోసి గుర్తు పట్టకుండా కాల్చి వేశాడు. రాజేశం కనపడడం లేదని అతని కుటుంబ సభ్యులు పెద్దపల్లి పోలీసు స్టేషన్ లో జులై 30 న ఫిర్యాదు చేయగా హంతకుడు శ్రీనివాస్ వారితోనే ఉండడం గమనార్హం.

ఆ తర్వాత పోలీసులు మృతుడు రాజేశం పోన్ లిస్టు పరిశీలించగా చివరగి పోన్ చేసింది శ్రీనివాస్ అని తేలింది. దీంతో పోలీసులు తనదైన శైలిలో విచారించగా రాజేశం ను హత్య చేసింది ఒప్పుకున్నాడు. దీంతో హంతకుడు శ్రీనివాస్ ను మంథని అటవి ప్రాంతానికి పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకవచ్చి శవాన్ని పంచనామా చేసి అక్కడే పోస్ట్ మార్టం చేయించారు. అక్కడ రాజేశం అస్థి పంజరం మాత్రమే మిగిలి ఉన్నది. హంతకుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈ హత్యకు ఇంకా ఎవరికైనా సంబదాలు ఉన్నాయన్న కోనంలో విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇది ఇల ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం రాజేశం వద్ద లక్ష అప్పు శ్రీనివాస్ తీసుకున్నిడని అడిగి నందుకే శ్రీనివాస్ అతని తల్లి దండ్రులు కలిసి చంపారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏసీపీ వెంట మంథని, పెద్దపల్లి సిఐలు మహేందర్, నరేందర్, పెద్దపల్లి ఎస్ఐ ఉపేందర్ రావుతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.