శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొనే దంపతుల ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు.. తరుచూ శృంగారంలో పాల్గొనేవారి వయసు ఉన్నదాని కంటే కాస్త తక్కువగా కనబడుతుందని చెబుతున్నాయి.శృంగారం మంచి వ్యాయామంగా కూడా పనిచేసి శరీరంలోని కేలరీలను కరిగించడానికి ఉపయోగపడుతుంది. శృంగార సమయంలో విడుదలయ్యే డోపమైన్,ఎండార్ఫిన్‌ల వల్ల మనిషిలో ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించి ఉల్లాసమైన మూడ్‌లోకి తెప్పిస్తాయి.శృంగారం వల్ల కలిగే పలు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రెగ్యులర్ సెక్స్‌ వల్ల ప్రయోజనాలు…

  • శృంగారంలో పాల్గొనడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
  • రెగ్యులర్ సెక్స్ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ
  • శృంగారం శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

క్రమం తప్పే నెలసరితో బాధపడేవారికి శృంగారం పెద్ద గొప్ప ఉపశమనం. రెగ్యులర్ సెక్స్ పీరియడ్ సమయంలోఉండే నొప్పిని తగ్గిస్తుంది.
రెగ్యులర్ సెక్స్‌లో పాల్గొనేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువ. వారానికి మూడుసార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చునని సర్వేలు చెబుతున్నాయి….