ఓ తల్లి పశువుల పాకలో ఉరివేసుకుంది.. నిండు గర్భిణీ అయిన తల్లి శవం దూలానికి వేలాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సాహినీ అనే మహిళా పోలీసు అధికారికి చనిపోయిన లక్ష్మీ చీరలో రెండు కాళ్ళు మధ్య ఏదో కడలాడుతున్నట్టు కనిపించింది, వెంటనే పురిటి శిశువు తల్లి గర్భం నుంచి బొడ్డు పేగు ఆధారంగా వేలాడుతున్నట్టు గ్రహించి శవాన్ని కిందకు దించి, డాక్టర్ ను పిలిపించి బొడ్డు పేగు కత్తిరించి బిడ్డను ఆసుపత్రికి పంపింది.

ఆత్మహత్య చేసుకున్న లక్ష్మికి ఇది ఐదో కాన్పు.. ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి ప్రాణం పోతున్న సమయంలో బిడ్డ గర్భం నుంచి బయటకు వచ్చి బొడ్డు పేగు సాయంతో వేలాడుతున్నట్టు డాక్టర్ చెప్పారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం అని అన్నారు. తల్లి ప్రాణం పోవడం, బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడం ఒక్క సారిగా జరిగాయని తెలిపారు. మధ్యప్రదేశ్ లోని కతని లో ఈ సంఘటన చోటుచేసుకుంది.