పదిహేనేళ్ల కూతురు సహా మహిళపై 18మంది ,రెండు నెలల పాటు

దేశంలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. ప్రాంతం, రాష్ట్రం ఏదైనా. స్త్రీలపై దాడులు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి.

ముఖ్యంగా పదిహేనేళ్ల కూతురు సహా మహిళపై 18మంది రెండు నెలల పాటు అత్యాచారం జరిపిన ఘటన సంచలనంగా మారింది. హరియాణాలో జరిగిన ఈ దారుణంలో, 7గురు పోలీసులు కూడా పాలుపంచుకోవడం గమనార్హం.
మరో కేసు ఢిల్లీలో వ్యాపారం చేసే నెపంతో మహిళను రప్పించిన ఓ యువతి, మరో ఇద్దరు పురుషులతో కలిసి మహిళపై లైంగిక దాడికి పాల్పడింది. పురుషులు అత్యాచారం జరపగా, వారికి సహకరించింది.

మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఇద్దరు పురోహితులు గుడిలోనే అత్యాచారం జరిపారు. చిన్నారికి మిఠాయి ఇచ్చేందుకు లోపలికి పిలిచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. బెంగాల్‌లో ఓ ప్రియుడు తనతో కలిసి విహారానికి వచ్చిన యువతిపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఓ నిర్మానుష్యప్రాంతంలో వదిలేసి పరారయ్యారు. పంజాబ్‌లోని లూథియానాలో ఓ మహిళను ఆమె రెండేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే ఓ వ్యక్తి రేప్‌ చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మరుసటి రోజు రాత్రి ఆమె ఇంటికి వచ్చి చితకబాది, మరోసారి అత్యాచారం చేశాడు..