ఈ రోజు తేది: 01-10-2019 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి గారు జిల్లా పోలీసు అధికారులతో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేషంలో తూప్రాన్ మరియు మెదక్ సబ్ డివిజన్ డి.యస్.పి లు సి.ఐ.లు మరియు యస్.ఐ.లు పాల్గొన్నారు. ఈ సమావేశం లో యస్.పి. గారు గత నెలలో జరిగిన నేరాల గురించి సిబ్బందిని కూలంకశముగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.పి గారు మాట్లాడుతూ న్యాయం, సహాయం కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడూ మాకు అతిథులేనని.

వీరికి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, ఠాణాలో అడుగుపెట్టే బాధితుడు, ఫిర్యాదుదారుడికి అక్కడి వాతావరణమే న్యాయం జరుగుతుందనే భరోసా కలిగించేలా ఉండాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ సేవలు వుండాలని అన్నారు, జిల్లాలో పెండింగ్ లో వున్నా నాన్ బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు చేసినారు, పారదర్శకంగా ప్రతి కేసులో విచారణ జరిపి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా పనిచేయాలని, కన్విక్షన్ రేటు పెంచాలని అన్నారు, అదేవిధంగా పాత మరియు గత నెలలో జరిగిన కేసుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే విచారణలో ఉన్న గ్రేవ్ కేసుల యొక్క వివరాలను, ఎస్.సి., ఎస్.టి. కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకొని విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

అలాగే వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇతరులు ప్రామాదాలకు గురి అయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మద్యం తాగి వాహనం నడిపేవారు టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకనుండి తాగి వాహనాలు నడిపేవారిపైన కటిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో మూల మలుపులలో, ప్రమాదాలు జరిగే చోట్లలో సూచిక బోర్డ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమ నిభందనలు పాటిస్తూ పోలిసు వారికి సహకరించాలని కోరినారు, అలాగే జిల్లా లో కల పెట్రోలింగ్, బ్లూ కోట్స్ యొక్క పనితీరుని గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఏదైనా సమస్య గురుంచి 100 దయాల్ కు కాని పోలీస్ స్టేషన్ కి కాని ఫోన్ చేస్తే వెంటనే స్పందిచి బాదితులకు న్యాయం చేయాలని సూచించారు.

ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా చూడాలని ఈ సంధర్భముగా అధికారులకు సూచించారు. అలాగే జిల్లా సిబ్బందికి సాంకేతిక పరిజ్నానాన్ని పెంపొందించుటకై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి. గారు తెలిపారు. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతూ ఏవరైన తప్పి పోయారు అని లేదా కనిపించుటలేదు అని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

దొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేషంలో మెదక్ జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.డి. నాగరాజు గారు, మెదక్ డి.యస్.పి. కృష్ణమూర్తి గారు, తూప్రాన్ డి.యస్.పి. శ్రీ. కిరణ్ కుమార్ గారు, సి.ఐ.లు, యస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.