ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ను ప్రేయసికి కానుకగా ఇచ్చి తన ప్రేమను అంగీకరించమని వేడుకున్నాడు. కాని ఆమె మాత్రం ఇష్టపడలేదు.

ఢిల్లీలో జీతు అనే యువకుడు ఓ యువతి వెంటపడుతూ, ప్రేమించాలని వేధిస్తున్నాడు. తన వద్ద ఉన్న తాజ్ మహల్ బొమ్మను తీసుకుని ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. తాజ్ మహల్ తీసుకుని ప్రేమించమనీ ఒత్తిడిచేస్తు తాజ్ మహల్ బొమ్మని ఆమె పైకి విసిరాడు. మిస్ అయి , పాపం అది పోయి అక్కడ కూర్చుని భోజనం చేస్తున్న ఆ యువతి తండ్రి తలకు తగిలి గాయం అయింది .

ఈ క్రమంలో యువతి అసలు విషయం చెప్పటంతో కుటుంబీకులు పోలీసులను కంప్లైంట్ చేయగా వారు కేసు నమోదు చేసుకుని జీతును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా ఆ తాజ్ మహల్ కథలో తండ్రి తల పగిలింది. ప్రేమికుడు జైలుపాలయ్యాడు.