తాను త్యాగం చేస్తేనే కొండా సురేఖకు ఎమెల్యే టికెట్ వచ్చింది

తాను త్యాగం చేస్తేనే కొండా సురేఖకు ఎమెల్యే టికెట్ వచ్చింది..

-పార్టీకి ,ప్రజలకు నష్టం జరిగితె నరసింహావతారం ఎత్తుతా..
-జోషీ,మసూద్ లను సస్పెండ్ చేసే అధికారం మీకూ నాకూ లేదు..
-నగర అభివృద్దే నా ప్రదాన లక్ష్యం..
-చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా..
-ఒక అక్కగా మీరంటే గౌరవం,ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి..
-ఒక్కరు మూడు టిక్కెట్లు అడగగా లేనిది ఉద్యమకారున్ని నేను టికెట్ అడగటంలో తప్పేంటి..

-ఇక్బల్ మినార్ విషయంలో ఓపికతో వ్యవహరించిన హిందు ముస్లింలకు అధికారులకు దన్యవాదాలు..

-నేను ఇక్కడే పుట్టా ఇక్కడే చస్తా..

— మేయర్ నన్నపునేని నరేందర్..

రాజకీయ దురుద్దేశంతో ప్రజలకు ,పార్టీకి ఎవరు నష్టం కలిగించినా నరిసింహావతారం ఎత్తుతా అని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు.గత రెండు రోజులుగా పోచమ్మ మైదాన్ లో జరుగుతున్న ఇక్బల్ మినార్ విషయంపై మేయర్ నరేందర్ ఈ రోజు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు.

గత రెండు రోజుల నుండి ఇక్బాల్ మినార్ విషయంలో తాను లేని సమయంలో నాపై అబాండాలు వేయడం సరైనది కాదని ప్రజలకు స్పష్టత ఇవ్వడం కోసమే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసానని మేయర్ నరేందర్ తెలిపారు.
ఇక్బాల్ మినార్ విషయంలో తనపై విషపూరితమైన కుట్ర జరిగిందని,ఈ విషయంలో వాస్తవాలు గ్రహించి హిందూ ముస్లిం సోదరులు,అధికారులు సంయమనం పాటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
హిందూ ముస్లింల అంశం వచ్చినప్పుడు ఓపికగా అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చని కానీ వారిని రెచ్చగొట్టి ప్రజల్లో గందరగోలం సృష్టించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.అనవసరమైన వ్యక్తిగత కక్షలతో ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్డుపక్క ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇక్బల్ మినార్ నిర్మించుకోమని ఉందని,ఈ విషయంలో మా ముస్లిం సోదరులను రెచ్చగొట్టడం సబబు కాదని ఆయన అన్నారు.అసలు మేయర్ అయిన నాకు,కార్పోరేటర్ భర్త సురేష్ జోషీలకు ఇక్బర్ మినార్ వివాదంతో అసలు సంబందమే లేదని,కుట్ర పూరితంగా తమ వ్యక్తిగత కక్షతో ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెల్లడం సరైన పద్దతి కాదని అన్నారు.మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఒక మార్వాడి అయిన సురేష్ జోషీ కుటుంబం కార్పోరేటర్ గా గెలవడం గర్వించదగిన విషయమని అన్నారు.గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్బల్ మినార్ ఎవరూ పట్టించుకోలేదని,ఇప్పుడే దానిపై ఇంత ప్రేమ రావడం వెనక ఉద్దేశం ఏంటని మేయర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

ముప్పై ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యే సురేఖ గారు మూడేండ్ల రాజకీయానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.నగర మేయర్ కు కార్పోరేటర్లకు తండ్రీ కొడుకుల వలె అనుభందం ఉంటుందని,అలాంటి వారిని నా వెంట తిరిగితే కుక్కలు అనడం బాదాకరమని మేయర్ అన్నారు.మేము కుక్కలమేనని తెరాసా పార్టీ కుక్కలమని,తేడా వస్తే నరసింహ అవతారం కూడా ఎత్తుతామని మేయర్ హెచ్చరించారు.ఎమ్మెల్యే గారు బాషా దోరణి మార్చుకోవాలని,మీకు ఇచ్చే గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.బ్రతికినంత కాలం ప్రజలకు,పార్టీకి అందరికి అండగా ఉంటానని,నన్ను నమ్మకున్న ప్రజలకు చివరి శ్వాస వరకు తోడుంటానని మేయర్ అన్నారు.

తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి మైనార్టీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసారని గుర్తుచేసారు.ఈ నగరంలో హిందు ముస్లింలు ఐక్యతతో ఉంటారని అది చూసే ఒక మైనార్టికి డిప్యూటీ మేయర్ గా చేసారని,అది మైనారిటీ సోదరులకు కూడా తెలుసునని అనవసరంగా వాళ్ళను గందరగోళానికి గురిచేయద్దని మేయర్ సూచించారు.

మసూద్ ,జోషిలను సస్పెండ్ చేసే అధికారం ఎమ్మెల్యే అయిన మీకు మేయర్ అయిన నాకు లేదని,అది కేసీఆర్ గారు చూసుకుంటారని తెలిపారు.
తాను తెలంగాణా ఉద్యమకారునిగా కేసీఆర్ గారు ఏది చెపితే అది వారి ఆదేశానుసారం పనిచేసానని ,నేడు ప్రభుత్వంలో ప్రజల కోసం కేసీఆర్ గారు ఏది చెపితే అది కాపలాకుక్కలా పనిచేస్తానని అన్నారు.ఒక్కరు మూడు టిక్కెట్లు అడగగా లేనిది.ఉద్యమంలో ఉన్న నేను ఒక్క టిక్కెట్ అడిగితే తప్పేంటని ప్రశ్నించారు.ఇక్కడే పుట్టిన నాకు ఆ అర్హత కూడా ఉందని, నేను బచ్చానే కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చడం గర్వంగా ఉందని మేయర్ తెలిపారు.
ప్రజలకు నష్టం జరిగేపని తాను ఏనాడూ చేయలేదని ,అలా చేసినట్టైతే బలిగా నేను నిలబడతానని తోటి నాయకులకు భరోసా ఇచ్చారు.

తాను 2014లో త్యాగం చేస్తే నేటి ఎమ్మెల్యే కొండా సురేఖ కు టికెట్ వచ్చిందని మేయర్ నరేందర్ గుర్తుచేసారు.

నేను ఇక్కడే పుట్టానని,ఇక్కడే పెరిగానని నగర ప్రజల బాగు కోసం పనిచేస్తానని,చివరకు ఇక్కడే చస్తానని ఆయన అన్నారు.

వ్యక్తిగత కక్షలతో,రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ తనపై బురదచల్లాలని చూస్తే సహించేది లేదని.ప్రజలే అలాంటి వారికి తగిన సమాదానం చెపుతారని మేయర్ నరేందర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here