ప్రముఖ నటి, బుల్లితెర హీరోయిన్‌ శివాంగీ జోషీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు షేర్‌ చేసింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ట్రీట్‌మెంట్ తీసుకున్న ఫొటోను షేర్‌ చేసిన శివాంగీ కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు 2 సీరియల్‌తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాంగి జోషి. అయితే తాజాగా మరో ప్రముఖ నటి, బుల్లితెర హీరోయిన్‌ కూడా ఆస్పత్రి పాలైంది. బాలీవుడ్‌ టీవీ నటి, ‘బాలికా వధు 2’ ఫేం శివాంగీ జోషి కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు స్వయంగా ఆమె వెల్లడింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలిపింది.

Advertisement

‘హాలో మీ అందరికి ఒకటి చెప్పాలి గత కొద్ది రోజులుగా నేను కఠిన పరిస్థితులను చూశాను. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ వల్ల ఆస్పత్రిలో చేరాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డాక్టర్స్‌ సపోర్టుతో ప్రస్తుతం కోలుకున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మీ శరీరాన్ని కాపాడుకోవాలంటూ ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌కు ఆమె సూచించింది. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రెట్‌ చేసుకోవాలంటూ సలహా ఇచ్చింది. కాగా ‘బాలిక వధు 2’తో నటిగా గుర్తింపు పొందిన శివాంగి జోషి ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ సీరియల్‌తో మరింత పాపులర్‌ అయ్యింది. అంతేకాదు ప్రముఖ రియాలిటీ షో ‘ఖత్రోంకి ఖిలాడీ 12’ సీజన్‌లో కంటెస్టెంట్‌గా చేసి తనదైన ఆటతో అందరికి ఆకట్టుకుంది.