తెరాస అభ్యర్థి వినయ్ నామినేషన్ కు రూ.500 ఫండ్ ఇచ్చిన ఆడపడుచు

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ తెరాస అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈ రోజు 47 వ డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వినయ్ అన్నకి నామినేషన్ ఖర్చు నిమిత్తం తను దాచుకున్న500 రూపాయలను ఇచ్చి అభిమానాన్ని చాటుకుంది. వినయ్ సంతోషం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞత తెలిపారు. 47,48,49 డివిజన్లలో ప్రజా ఆశీర్వద యాత్ర నిర్వహించారు, ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ గారికి ప్రజలు పెద్దఎత్తున బొట్టు పెట్టి స్వాగతం పలికారు, మహాకూటమి ని బొందపెట్టి ,కేసీఆర్ గారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రజలు తెలిపారు, ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఒకే ఓటుతో ప్రాజెక్టులు ఉద్యోగాలు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను, తెలంగాణ కు ఇప్పటికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాస్తున్న టీడీపీ ని చెంప్ప చెల్లు మనేల తీర్పు ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విమోచన రాష్ట్ర చైర్మన్ నాగుర్ల వెంకన్న గారు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు .