తెరాస నుంచి ముగ్గురు సస్పెన్షన్ :

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు ఉంటాయ

భూపాలపల్లి మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ లక్కిరెడ్డి స్వరూపరాణి, లక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు రేగులగూడెం గ్రామానికి చెందిన బూసి దేవెందర్‌రెడ్డిను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌ తెలిపారు. గత కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కారణంగా అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు ఉంటాయని అధిష్టానం ఆదేశించినట్లు ఆయన తెలిపారు..