వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక నేడు (శనివారం) జరుగనుంది. ఉదయం 11 గంటలకు నగరంలోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఎన్నికను నిర్వహిస్తారు. దీనికి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారిగా వ్యవహరిస్తారు.
మరోవైపు, ఈ ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పలు జాగ్రత్తలు తీసుకుంది. అధిష్ఠానం గుండా ప్రకాష్‌రావు పేరును ఖరారు చేసిందని వార్తలు వెలువడిన నేపథ్యంలో కొందరు మేయర్ పదవి కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఎన్నిక ప్రశాంతంగా జరగాలని జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి, అంగీకార పత్రంపై వారితో సంతకాలు, తీర్మానాలు చేయించారు. ఈ నేపథ్యంలో వరంగల్ మేయర్ గుండా ప్రకాష్‌రావు అవుతారా..? లేక అధిష్ఠానం ఏమైనా మార్పులు చేయబోతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది…