టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొట్టిపారేశారు. శాయంపేట మండలం జోగంపల్లి చలి వాగు ప్రాజెక్ట్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హస్తం గుర్తుపై గెలిచిన తాను టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు.

తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే. ప్రతిపక్ష నేత హోదా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.