తెరాస వరంగల్ తూర్పు ఆభ్యర్ధి గా గుండు సుధారాణి.

వరంగల్ తూర్పు నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఉత్కంఠానికి తెరపడనుంది.

మాజీ ఎంపి , రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గుండు సుధారాణికే వరంగల్ తూర్పు టికెట్ ఖరారు కానుంది. టీఆర్‌ఎస్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలో వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె అదిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసి కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నాక, ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.

తాజా ఈస్థానాన్ని మహిళకు ఇవ్వాలనే ఉద్దేషంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. దీంతో అధిష్టానం మాజీ ఎంపి గుండు సుధారాణి వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. గతంలో మహిళా అభ్యర్థి ప్రాతినిద్యం వహించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన గుండు సుదారాణిని పోటీకి నిలిపినట్టు అయితే ఆమె గెలుపు నల్లేరుపై నడక అవుతుందని పార్టీ భావిస్తుంది.

సుధారాణి వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకురాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈవిడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ కోసం గళమెత్తి తెరాస పార్టీ లో చేరారు.

కలిసి వచ్చిన అంశాలు :

వెనుకబడిన వర్గాలకు చందిన పద్మశాలి నాయకురాలిగా గుర్తింపు. దీనికితోడు జిల్లాలో వివాదాలు లేని నాయకురాలుగా పేరుంది. కలిసి వచ్చిన బీసీ మహిళ పద్మశాలి, తూర్పు లో పద్మశాలి ఓట్లే కీలకం, ఈ సామజిక కారణాల వల్ల కెసిఆర్ గారు గుండు సుధారాణి గారికి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది..