హైదరాబాద్: ఎన్నికల హామీల అమలులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఇప్పటికే ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు స్వీకరించిన ప్రభుత్వం వాటిని వడపోత పడుతోంది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కేవలం ఇంటి ఓనర్లకే వర్తిస్తుందని రెంట్ కు ఉన్న వారికి ఇది వర్తించదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో దీనిపై టీఎస్ ఎస్ పీడీసీఎల్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ప్రతిపాదిత గృహ జ్యోతి పథకం కింద అద్దెకుండే వారు కూడా అర్హులని పేర్కొంది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.