ఆదిలాబాద్‌: మంచిర్యాల జిల్లా బెలంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి మోసం చేశారని సంచలన ఆరోపణలు చేసిన యువతి మరొక ‌ వీడియోను విడుదల చేశారు. రకరకాలుగా తమను వేధించారని ఆమె అందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మోసాలను బట్ట బయలు చేస్తామన్నారు, ఎమ్మెల్యేను తాము బ్లాక్ ‌మెయిల్ చేస్తున్నాననేది అబద్దమన్నారు.

ఎమ్మెల్యే తప్పుడు కేసులతో తనను అరెస్టు చేయించారన్నారు కానీ పోలీసులు తాము పట్టుకున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసుల సంగతి తేల్చాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ పుటేజీ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు తనకు ప్రాణహని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఇందులో అనేకమంది ఉన్నారని వారిపై సమగ్రమైన విచారణ. జరిపించాలని కోరారు.