చంద్రకళ సొంతూరు కరీంనగర్ జిల్లా గర్జనపల్లి. 2008లో సివిల్స్ సాధించిన ఆమె, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో పని చేశారు. బులంద్ షహర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రోడ్ల పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లకు క్లాస్ పీకిన వీడియో గతంలో వైరల్ అయ్యింది. సిన్సియర్ అధికారిణిగా పేరు తెచ్చుకున్న చంద్రకళను. కేంద్రం డిప్యుటేషన్ మీద తీసుకుని స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా ప్రధాని మోదీ తన కోర్ టీమ్‌లో నియమించుకున్నారు. ఈ క్రమంలో ఇసుక మాఫియాతో ఆమె చేతులు కలిపారని ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే ఆమె ఇసుక మాఫియాతో చేతులు కలిపారా? లేదా? అన్నది తెలియాలంటే సీబీఐ విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాల్సిందే!
మొత్తం తతంగం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో వున్నప్పుడు జరగడంతో.

ఈ ఎటాక్స్ అన్నీ అఖిలేష్ యాదవ్ టార్గెట్‌గా జరిగినవేనని ప్రచారం జరుగుతోంది. యూపీలో బీజేపీని మట్టికరిపించేందుకు ఎత్తులు వేస్తున్న అఖిలేష్ యాదవ్‌కి చెక్ చెప్పడానికే కేంద్రం చంద్రకళను ‘వాడుకుంటోందని’ యూపీ మీడియా కోడై కూస్తోంది.