తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం నియామకాల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి కాగా ప్రస్తుతం దేహధారుడ్య పరీక్షలు నిర్వహిస్తోంది టీఎస్ఎల్‌పీఆర్‌బీ. అయితే, పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోన్న మహిళల్లో ఉన్న గర్భిణీల కోసం పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన కొంత మంది మహిళలు గర్భంతో ఉండటం వల్ల ఈవెంట్స్‌కి హాజరు కాలేకపోతున్నారు. గర్భిణీ అభ్యర్థులకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ శుభవార్త చెప్పింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం పరీక్షలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈవెంట్స్‌ జరుగుతున్నాయి.

ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో పాసైన గర్భిణీ అభ్యర్థులకు ప్రస్తుతం ఈవెంట్స్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. గర్భిణీలు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులు బాటు కల్పించినట్లు ప్రకటించింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన గర్భిణీ స్త్రీలు నెల రోజుల్లోగా ఈవెంట్‌లో పాల్గొనాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఆదేశించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోలీస్ అభ్యర్థులకు దేహాదారుడ్య పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.