మహబూబ్‌నగర్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వాల్యనాయక్‌ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన కాట్రావత్‌ స్వామి(28) భార్య నీలమ్మను 15 రోజుల కిందట గొడవపడటంతో గోపాల్‌పేట మండలం కేశంపేట తండాలో ఉన్న తల్లిగారి ఇంటికి వెళ్లింది.

​​​​​​​కాపురానికి రావాలని వెళ్లి అడిగినా రాకపోవడంతో మార్చి 27న కోళ్ల షెడ్డులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.