ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఓ కళాశాలలో డెంటల్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మానస ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలకు సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న మానస పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. హాస్టల్‌లో మంటలు చెలరేగటంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. హాస్టల్ నిర్వాహకులు మానస ఉంటున్న రూమ్ తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లే సమయానికి ఆమె మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వరంగల్‌కి చెందిన సముద్రాల మానస మమత మెడికల్ కళాశాలలో చదువుతోంది. మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.