ప్రేమించే వరకు వెంటపడి ఆ వ్యక్తి తీరా నమ్మిన తర్వాత ఆరేళ్లుగా ఆమెతో కలిసి తిరిగి పెళ్లి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది. మోసపోయానని తెలుసుకొని బలవన్మరణానికి సిద్దపడింది. సంగారెడ్డి జిల్లాలో ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ యువతి చావు తప్పి ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. తనను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని తనకు న్యాయం చేయమని వేడుకుంటోంది. వివరాలు: సంగారెడ్డి జిల్లా పటన్‌చెరులో కూడా ఓ బీటెక్ చదివిన యువతి ప్రియుడి చేతిలో మోసపోయానంటోంది. రామచంద్రాపురానికి చెందిన వినూత్నేశ్వరి పటేల్‌గూడలోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చదువుతుండగా అమీన్‌పూర్‌ మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండో కుమారుడు ఈర్ల ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

Advertisement

కాలేజీ రోజుల్లో ప్రేమ బీటెక్ చదివిన యువతితో పెళ్లి చేసుకుంటానని ఇంతకాలం ప్రేమవ్యవహారం నడిపిన ప్రశాంత్ షడన్‌గా వేరే యువతితో శుక్రవారం నిశ్చితార్ధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఎంపీపీ దేవానంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి బాధితురాలి కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగడంతో మనస్తాపానికి గురైంది. తనను ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక విషపదార్ధాలు తిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతనితోనే పెళ్లి కావాలి
ప్రేమించిన వ్యక్తి తనను తిరస్కరించాడనే మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువతిని పటాన్‌చెరువు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని వైద్యుల తెలిపారు. అయితే మీడియాతో మాట్లాడిన బాధితురాలు తనకు ప్రియుడు ప్రశాంత్‌తోనే వివాహం జరిపించాలని కోరుతోంది. ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు తండ్రి పలుకుబడి చూసుకొని పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటాడా లేక యువతిని పెళ్లి చేసుకొని న్యాయం చేస్తాడో చూడాలి.