Advertisement

RX 100తో తెలుగు తెరపై అందాల విందు చేసిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా తర్వాత అమ్మడుకు పుల్ ఫాలోయింగ్ వచ్చింది. తొలి సినిమాలోనే ఛాలెంజింగ్ పాత్ర చేసి ఔరా అనిపించుకుంది పాయల్. ఇప్పుడు మరోసారి RDX లవ్ సినిమాతో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. టీజర్ చూసిన తర్వాత పూర్తిగా పెద్దలకు మాత్రమే అనిపించేలా కట్ చేసారని అర్థమైంది.

మరీ ముఖ్యంగా కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉండేలా టీజర్ కట్ చేసిన దర్శకుడు ట్రైలర్స్‌లో మాత్రం పూర్తి వేరియేషన్ చూపిస్తున్నాడు. అసలు టీజర్, ట్రైలర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా అద్బుతమైన స్ట్రాటజీ చూపించాడు. పాయల్‌ను కేవలం స్కిన్ షో కోసమే ఎంచుకున్నాడేమో అనేంతగా టీజర్ వస్తే ట్రైలర్‌లో మాత్రం ఫుల్లుగా సీరియస్ కథ చెప్పాడు…

ఇక ట్రైలర్ లో హీరో హీరోయిన్ల మధ్య బోల్డ్ రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. మరి ఆ సీన్లు కథలో భాగంగా వస్తాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేదిగానే ఉంది. ‘RDX లవ్’ అక్టోబర్ 11 వ తేదీ రిలీజ్ అవుతోంది. అంతలోపు ఈ రిలీజ్ ట్రైలర్ పై ఒక లుక్కేయండి.. 

Advertisement