హన్మకొండ: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి యత్నించి.. హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రవీణ్ అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. కొద్దిసేపటికి మేల్కొన్న పాప తల్లిదండ్రులు చిన్నారి కనిపించకపోయే సరికి కంగారు పడ్డారు. చుట్టుపక్కల ఆచూకీ కోసం చూడగా ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యం కంట పడింది. అప్పటికే చిన్నారి అస్వస్థతకు లోనైంది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ప్రవీణ్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది