హన్మకొండ లో దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మానవ మృగం రెచ్చిపోయి, అభంశుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి చేసింది. ఆ కామాంధుడిని ఉరి తీసే వరకు ఊరుకోమని.. ప్రతి ఒక్కరు అంటున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నారి జీవితం చిద్రం చేసిన వాడిని ఉరి తియ్యాలని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పట్ల యాంకర్ రష్మీ స్పందించింది. 
‘ఏం చేసిందని 9 నెలల పాపపై విధి కక్షగట్టింది 
ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా 
ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా 
ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా 
ఏం చేసింది ఆమె????’ అని రష్మి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే అభంశుభం తెలియని 9 నెలల పాప ఏం తప్పు చేసిందని ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించాడని పరోక్షంగా రష్మి తన ఆవేదన వ్యక్తం చేసింది.