కోళ్ల ఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద మృతి తొర్రూర్ మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్ , అరవింద్ గౌడ్, మహేశ్ ముదిరాజ్ , మహేందర్ రెడ్డి అను యువకులు మేడ్చల్ జిల్లా లో అనుమానాస్పదంగా మృతి చెంది, పోస్ట్ మార్టంకై గాంధీ ఆసుపత్రికి తరలించారు,

కోళ్ల ఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను వరంగల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సందర్శించి నలుగురి మృతికి కారకులైన దోషులను వెంటనే దర్యాప్తు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు..