సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.

Advertisement

ఆ గెలుపు ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలదే
కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు 
ఇది ఎన్నికల నామ సంవత్సరం 
కేసీఆర్ గారి పాలన పట్ల ప్రజల విశ్వసనీయతకు ఎన్నికల ఫలితాలు సంకేతం. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థిగా మళ్లీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌ను టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ ఓటర్లకు కెటిఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మునిగిపోతుందని ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ వాళ్లే మునిగిపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు ప్రచారం చేసినా కెసిఆర్‌పై నమ్మకంతోనే టిఆర్‌ఎస్‌ను గెలిపించారని కొనియాడారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు 47 శాతం ఓట్లు వేసి, 75 శాతం స్థానాల్లో కెసిఆర్‌ను గెలిపించుకున్నారని ప్రశంసించారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణమని కెటిఆర్ ప్రశంసించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఒక దిక్సూచిగా మారాయని, అనేక రాష్ట్రాల నుండి ప్రతినిధులు, అధికారులు వచ్చి రాష్ట్రంలో చేపడుతున్న పథకాల మీద అధ్యయనం చేస్తున్నారన్నారు