ఆస్తి ఇవ్వలేదన్న పగతో మామను కోడలు హత్య చేయించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: గంటప్ప(55) అనే కాంగ్రెస్ నాయకుడు కర్ణాటకలోని భైరవనదొడ్డి గ్రామ సమీపంలోని ఓ తోటలో ఫిబ్రవరి 25న హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆస్తి విషయమై కోడలితో ఆయనకు విభేదాలు ఉన్నాయని, దీంతో గంటప్ప కోడలే అతడిని హత్య చేయించిందని చెప్పారు.

ఆస్తిలో తనకు భాగం ఇవ్వడంలేదన్న అక్కసుతో ప్రియుడికి సుపారీ ఇచ్చి మామను హత్య చేయించినట్లు విచారణలో ఆమె అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, వివాహం కానప్పటి నుంచి ప్రియుడితో ఆమె అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.