తోడి కోడళ్ళే – ఆ పంచాయితీలో పందెం కోళ్లు …
పెద్ద కోడలు టీఅర్ఎస్ , చిన్నకోడలు కాంగ్రెస్…
వారిద్దరూ తోటి కోడళ్లు. కానీ సర్పంచ్ పదవి కోసం ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. సూర్యాపేట మండలం ఆరెగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు అన్నదమ్ముల సతీమణులు పోటీలో నిలవడంతో ఆ గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అన్న పుల్గం వెంకటరెడ్డి, తమ్ముడు పుల్గం రాఘవరెడ్డి తమ భార్యలను సర్పంచ్ బరిలో నిలిపారు. ఇంటికి పెద్ద వాడైన పుల్గం వెంకటరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య సుజాతను పోటీలో నిలపగా ఆయన తమ్ముడు పుల్గం రాఘవరెడ్డి కూడా తన భార్య స్వాతిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంచారు. అన్నదమ్ముల భార్యలు సర్పం చ్ బరిలో ఉండడంతో ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే ఆలోచనలోపడ్డారు.